ఆ లిస్ట్​లో ఏకైక ఇండియన్ సినిమాగా ’12th ఫెయిల్’ రికార్డు

-

ఇటీవల ఎక్కడ చూసినా  ’12th ఫెయిల్’ సినిమా గురించే చర్చ. ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ విధు వినోద్ చోప్రా తెరకెక్కించగా.. విక్రాంత్ మస్సే ప్రధాన పాత్రలో నటించారు. ఈ మూవీ గతేడాది అక్టోబర్ 27న విడుదలై ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్​ అందుకుంది. డిసెంబర్ 29 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్ స్టార్​లో స్ట్రీమింగ్ అవుతోంది.  విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది.

ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (IMDB) తాజాగా ప్రపంచ వ్యాప్తంగా టాప్ 250 ఉత్తమ చిత్రాల జాబితాను విడుదల చేయగా.. ఇందులో ’12th ఫెయిల్’ సినిమా 50వ స్థానంలో ఉంది.  టాప్​ 50లో ఉన్న ఏకైక ఇండియా సినిమా కూడా ఇదే. ఈ విషయాన్ని డైరెక్టర్ విధు వినోద్ ఎక్స్ ద్వారా తెలిపారు.

‘ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు చనిపోయినా ఫర్వాలేదనిపిస్తోంది’ అంటూ విధు వినోద్ ఈ సినిమాపై స్పందించారు. అయితే గతంలోనే ఈ చిత్రం ఐఎమ్​డీబీలో అత్యధిక రేటింగ్ పొందిన ఇండియన్ సినిమాగా రికార్డును సొంతం చేసుకుంది. హాలీవుడ్ చిత్రాలను వెనక్కినెట్టి మరి 9.2 రేటింగ్​తో సంచలనం సృష్టించింది.

Read more RELATED
Recommended to you

Latest news