ఆస్కార్ బరిలో 2018 సినిమా.. పురస్కారం దక్కేనా..?

-

ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారం ఆస్కార్ అవార్డుల కోసం నామినేషన్లు మొదలయ్యాయి. 2024 పురస్కారాల నామినేషన్ ప్రక్రియలో పలు భారతీయ సినిమాలు ఎంపికయ్యాయి. వీటిలో ఓ అరుదైన సినిమా కూడా నామినేషన్ దక్కించుకుంది. కేరళలో విధ్యంసం సృష్టించిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘2018’ సినిమాకు ఈ అరుదైన గౌరవం దక్కింది.

భారత్​ తరఫున ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల కోసం జరిగే నామినేషన్​ ప్రకియలో భారత్​ నుంచి 2018 సినిమా ఆస్కార్​ రేసులోకి దిగింది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించింది. ఆస్కార్ సెలెక్షన్​ కమిటీ చైర్మన్ గిరీశ్​ కాసారవల్లి ​ ఈ విషయాన్ని ఈరోజు వెల్లడించారు. 16 మంది సభ్యులతో కూడిన ఓ కమిటీ.. సినీ ఇండస్ట్రీలోని పలు సినిమాలను పరిశీలించి ఈ ‘2018’ మూవీని ఎంపిక చేసిందని తెలిపారు.

2018 సినిమాతో పాటు ఆస్కార్ నామినేషన్ ప్రక్రియలో పరిశీలించిన సినిమాలు ఇంకా ఏమేం ఉన్నాయంటే.. ‘ది కేరళ స్టోరీ’ (హిందీ), ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’, ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’ (హిందీ), ‘బలగం’ (తెలుగు), ‘వాల్వి’ (మరాఠీ), ‘బాప్లియోక్’ (మరాఠీ) ‘ఆగస్టు 16, 1947’ (తమిళం)తో సహా 22 చిత్రాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news