ఓటీటీలో ‘2018’ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

-

టోవినో థామస్.. ఈ మలయాళీ హీరో సినిమాల ఎంపికలో తన రూటే సపరేటు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్స్​తో ప్రేక్షకులను ప్రతిసారి తనదైన శైలిలో అలరిస్తున్నాడు. ప్రేక్షకుల టేస్టుగా తగ్గట్లుగా తన సెలక్షన్​తో ఆకట్టుకుంటున్నాడు. తాజాగా థామస్ నటించిన సినిమా 2018. ఈ చిత్రం తెలుగులో డబ్ అయి రిలీజ్ అయింది. డబ్బింగ్ చిత్రమైనా కలెక్షన్లలో దూసుకెళ్లింది.

జూడే ఆంథోని జోసెఫ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 2018 సినిమాలో టోవినో థామస్​తో పాటు కుంచకో బోబన్‌, అసిఫ్‌ ఆలీ, లాల్‌ తన్వి రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2018లో కేరళలో సంభవించిన వరదల ఇతివృత్తాన్ని తీసుకుని తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డు వసూళ్లు రాబట్టింది.

ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ‘2018’ ఓటీటీ రైట్స్‌ను సోనీలివ్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. జూన్‌ 7వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. సోనీలివ్‌ యాప్‌లో ఇందుకు సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు. మలయాళ సినీ చరిత్రలో రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన చిత్రంగా 2018 నిలిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version