ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని క్షమాపణలు చెప్పాల్సిందేనని..కాపు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కాపులను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వాక్యాలు వివాదాస్పదమయ్యాయి. పలు కాపు సంఘాలు నాని వాక్యాలపై మండిపడుతున్నాయి.
24 గంటల్లో కాపులకు నాని బహిరంగ క్షమాపణలు చెప్పాలని… లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రజా కాపునాడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రంశెట్టి అంజిబాబు హెచ్చరించారు. అలాగే కొడాలి నానిని వెంటనే వైసీపీ నుంచి బహిష్కరించాలని ఐక్య కాపునాడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహనరావు డిమాండ్ చేశారు. కాగా, నిన్న చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోకు కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. ఈ తరుణంలోనే.. కాపులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని. ఇప్పుడు ఆ వ్యాఖ్యలే వివాదంగా మారాయి.