2022: ఈ ఏడాది భారీ ట్రోలింగ్ కి గురైన చిత్రాలు ఇవే..!

-

2022 సంవత్సరం కొన్ని సినిమాలకు భారీ విజయాన్ని అందిస్తే.. మరికొన్ని సినిమాలకు పూర్తిస్థాయిలో నష్టాన్ని చూపించింది. అయితే మరికొన్ని సినిమాలు భారీ ట్రోలింగ్ కి కూడా గురి అయ్యారు. అయితే ఈ ఏడాది 2022 సంవత్సరం మొత్తానికి గాను విడుదలైన చిత్రాలలో భారీ ట్రోలింగ్ కు గురైన చిత్రాల గురించి ఇప్పుడు చూద్దాం..

సన్నాఫ్ ఇండియా:
మోహన్ బాబు హీరోగా నటించిన సినిమా సన్నాఫ్ ఇండియా.. ఈ సినిమా విడుదల అయ్యి డిజాస్టర్ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా పై నెటిజెన్స్ భారీ స్థాయిలో ట్రోలింగ్ చేశారు. శ్రీకాంత్ , మీనా, ప్రగ్యా జైస్వాల్ , ఆలీ, తనికెళ్ల భరణి తదితరులు నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 18న విడుదలై భారీ ట్రోల్లింగ్ కి గురైంది..

రాధే శ్యామ్:
రెబల్ స్టార్ ప్రభాస్ ఇదే ఏడాది నటించిన పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్.. ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన ఈ సినిమా పీరియాడికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కింది. అయితే ఈ సినిమాపై నెట్టింట ఒక రేంజ్ లో నెగిటివ్ ట్రోల్ అయింది . ఫస్ట్ పోస్టర్ నుంచి ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టేసారు నెటిజన్స్.

ఆచార్య:
మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ఆచార్య . కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలై విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొంది.

లైగర్:
ఏడాది అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా మొదటి షో నుంచే ఓ రేంజ్ లో ట్రోలింగ్ కి గురైంది . అంతేకాదు బాయ్ కాట్ అంటూ బాలీవుడ్ సెగ కూడా ఈ సినిమాను తాకింది.

ఇక వీటితోపాటు రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, మంచు విష్ణు జిన్నా సినిమాలు కూడా భారీ ట్రోల్లింగ్ కి గురి అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news