కేంద్ర నిధులను దొంగచాటుగా కాజేయడం సిగ్గుచేటు – వైఎస్ షర్మిల

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిధులను దొంగ చాటుగా కాజేయడం సిగ్గుచేటు అన్నారు వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల. కెసిఆర్ దొర సర్పంచులను ఉరికంభం ఎక్కిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసిఫాబాద్ జిల్లాలో 18 మంది సర్పంచులు మూకుమ్మడిగా రాజీనామా చేసి కెసిఆర్ చంప చెల్లుమనిపించారని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.

“అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్లు ఉంది మన కల్వకుంట్ల కమిషన్ రావు తీరు. పంచాయతీలకు ఎలాగూ నిధులు ఇవ్వరు. అటు కేంద్రం నుంచి వచ్చిన పదోపరకో సైతం దక్కనివ్వరు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అంటారు కానీ మన రాష్ట్రంలో ఆ కొమ్మలకే సర్పంచులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వంపై నమ్మకంతో సర్పంచులు అప్పులు తెచ్చి, పనులు చేపిస్తే.. గ్రామపంచాయతీలకు అవార్డులు వస్తున్నాయని.. త్రివార్డులు తీసుకుంటున్న కేసీఆర్ దొర.. బిల్లులు మాత్రం చెల్లించడం లేదు. ఒక్కో సర్పంచ్ కి 5 లక్షల నుంచి 30 లక్షల వరకు ఎగనామం పెట్టారు” అని మండిపడ్డారు వైఎస్ షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news