68వ ‘ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2023’ వేడుక ముంబయిలో అట్టహాసంగా జరిగింది. గురువారం రాత్రి జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ తారలు హాజరై సందడి చేశారు. ముఖ్యంగా బీ టౌన్ ముద్దుగుమ్మలు రెడ్ కార్పెట్‌పై డిఫరెంట్ ఔట్ఫిట్స్లో కనిపించి మెస్మరైజ్ చేశారు. ఈ ఏడాది ‘గంగూబాయి కాఠియావాడి’, ‘బాదాయ్ దో’ చిత్రాలకు అవార్డుల పంట పండింది.
ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు సహా 9 విభాగాల్లో ‘గంగూబాయి కాఠియావాడి’ అవార్డులను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఉత్తమ నటుడు సహా ఆరు కేటగిరీల్లో ‘బదాయ్ దో’ను ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వరించాయి. అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న జాబితాలో ఉన్న ‘ది కశ్మీర్ ఫైల్స్’కు ఒక్క అవార్డు రాకపోవడం గమనార్హం.
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ -2023 విజేతలు వీరే..
- ఉత్తమ చిత్రం: గంగూబాయి కాఠియావాడి
- ఉత్తమ దర్శకుడు: సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయి కాఠియావాడి)
- ఉత్తమ చిత్రం(క్రిటిక్స్): బదాయ్ దో (హర్షవర్థన్ కుల్‌కర్ణి)
- ఉత్తమ నటుడు: రాజ్‌కుమార్ రావ్ (బదాయ్ దో)
- ఉత్తమ నటుడు(క్రిటిక్స్): సంజయ్ మిశ్రా (వధ్)
- ఉత్తమ నటి: అలియా భట్ (గంగూబాయి కాఠియావాడి)
- ఉత్తమ నటి (క్రిటిక్స్): టబు (భూల్ భులయా2), భూమి పెడ్నేకర్ (బదాయ్ దో)
- ఉత్తమ సహాయ నటుడు: అనిల్ కపూర్ (జుగ్‌జుగ్ జీయో)
- ఉత్తమ సహాయ నటి: షీబీ చద్దా (బదాయ్ దో)
- ఉత్తమ గీత రచయిత: అమితాబ్ భట్టాచార్య (కేసరియా: బ్రహ్మాస్త్ర: శివ)
- ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్: ప్రీతమ్ (బ్రహ్మాస్త్ర: శివ)
- ఉత్తమ నేపథ్య గాయకుడు: అర్జిత్ సింగ్ (కేసరియా: బ్రహ్మాస్త్ర: శివ)
- ఉత్తమ నేపథ్యగాయని: కవిత సేథ్ (రంగిసరి- జగ్‌జగ్ జీయో)
- ఉత్తమ కథ: అక్షిత్ గిల్‌డియల్, సుమన్ అధికారి(బదాయ్ దో)
- ఉత్తమ స్క్రీన్‌ప్లే: అక్షిత్ గిల్‌డియల్, సుమన్ అధికారి, హర్షవర్థన్ కుల్‌కర్ణి( బదాయ్ దో)
- ఉత్తమ సంభాషణలు: ప్రకాశ్ కపాడియా, ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కాఠియావాడి)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ: సుదీప్ ఛటర్జీ (గంగూబాయి కాఠియావాడి)
- ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: సుబ్రత చక్రవర్తి, అమిత్ రాయ్ (గంగూబాయి కాఠియావాడి)
- ఉత్తమ కాస్ట్యూమ్స్: సీతల్ ఇక్బాల్ శర్మ (గంగూబాయి కాఠియావాడి)
- ఉత్తమ సౌండ్ డిజైన్: బిస్వదీప్ దీపక్ ఛటర్జీ (బ్రహ్మాస్త్ర: శివ)
- ఉత్తమ ఎడిటింగ్: నినద్ ఖనోల్కర్ (ఏన్ యాక్షన్ హీరో)
- ఉత్తమ యాక్షన్: పర్వేజ్ షేక్ (విక్రమ్ వేద)
- ఉత్తమ వీఎఫ్‌ఎక్స్: డెంజ్, రెడీఫైన్ (బ్రహ్మాస్త్ర పార్ట్-1: శివ)
- ఉత్తమ కొరియోగ్రఫీ: కృతి మహేశ్ (డోలీడా-గంగూబాయ్ కాఠియావాడి)
- ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: జస్పాల్ సింగ్‌సంధు, రాజీవ్ బర్నవాల్ (వధ్)
- ఉత్తమ తొలి చిత్ర నటుడు: అంకుష్ గీదమ్ (ఝండ్)
- ఉత్తమ తొలి చిత్ర నటి: ఆండ్రియా కెవిచూసా (అనేక్)
- జీవిత సాఫల్య పురస్కారం: ప్రేమ్ చోప్రా
- ఆర్డీ బర్మన్ అవార్డు: జన్వీ శ్రీమంకర్ (డోలీడా:గంగూబాయి కాఠియావాడి)