హత్య జరిగిన తెల్లారి 10:30 వరకు సాక్షిలో గుండె పోటు కథ ఎందుకు నడిపించారు?

-

వివేకా హత్య జరిగిన తెల్లారి 10:30 వరకు సాక్షిలో గుండె పోటు కథ ఎందుకు నడిపించారు? సాక్షి యాజమాన్యంపై ఫైర్‌ అయ్యారు రఘురామ. మాజీ మంత్రి వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డి బెయిలు రద్దు చేస్తూ హైకోర్టు కోర్టు తీర్పును ఇచ్చిందని, మే నెల 5వ తేదీ లోపు కోర్టులో లొంగి పోవాలని ఆదేశించిందని రఘురామకృష్ణ రాజు తెలిపారు. జూన్ 30వ తేదీ నాటికి చార్జిషీట్ దాఖలు చేయాలని సీబీఐని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వవచ్చునని హైకోర్టు పేర్కొన్నట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయని, డిఫాల్ట్ బెయిల్ అని ఎందుకు సంబోధించారో హైకోర్టు తీర్పు పూర్తి పాఠం అందితే కానీ చెప్పలేం అని అన్నారు.

సీబీఐ ఉదాసీనత వహించిన ఝాన్సీ లక్ష్మీబాయి గారి లాగా న్యాయ పోరాటం చేస్తున్న డా. సునీత గారు ఊరుకుంటారా?, ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు ద్వారా ఒక విధంగా సీబీఐ విజయం సాధించినట్లుగానే చెప్పాలని అన్నారు. వివేకానంద రెడ్డి గారి వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు వెళ్ళగా ఆయన అందుబాటులో లేనట్టు తెలిసిందని అన్నారు. వివేకానంద రెడ్డి హత్య జరిగిన మార్చి 14వ తేదీ, ఆ మరుసటి రోజు 15వ తేదీ కూడా గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి గారు యురేనియం కార్పొరేషన్ లో విధులకు హాజరు కాలేదని, 15వ తేదీ మాత్రం విధులకు హాజరైనట్లుగా తప్పుడు హాజరీని సృష్టించే ప్రయత్నాన్ని చేశారని అన్నారు. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి జయప్రకాశ్ రెడ్డి, వై.యస్. భారతి రెడ్డి గారి తండ్రి ఈసీ గంగిరెడ్డి గారికి సమీప బంధువని, ఇద్దరిదీ ఒకే గ్రామం అని, ఈసీ గంగిరెడ్డి గారి అభ్యర్థన మేరకే ఎంపీగా కొనసాగుతున్న సమయంలో వివేకానంద రెడ్డి గారు, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి యురేనియం కార్పొరేషన్లో ఉద్యోగాన్ని ఇప్పించారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version