96వ ఆస్కార్ అవార్డ్స్ కార్యక్రమం ప్రారంభం.. ఎక్కడ చూడొచ్చంటే?

-

అత్యంత ప్రతిష్టాత్మకమైన 96  ఆస్కార్ అవార్డుల వేడుక ఇవాళ తెల్లవారుజామునే ప్రారంభమైంది. నామినేటెడ్ సభ్యులే కాకుండా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ కార్యక్రమం అమెరికా లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగుతోంది. అయితే మీరు ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవాన్ని భారతదేశంలో ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారా

భారతదేశంలో ఇవాళ తెల్లవారుఝామున 4 గంటల నుంచి ఆస్కార్‌ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఇది OTT ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది. స్టార్ మూవీస్, స్టార్ మూవీస్ హెచ్‌డీ, స్టార్ వరల్డ్‌లో కూడా ఈ ఆస్కార్ అవార్డ్ వేడుకలను ప్రత్యక్షప్రసారం ద్వారా చూడొచ్చు. ఈ ఏడాది ఆస్కార్ ప్రెజెంటర్లలో ఏ భారతీయ స్టార్ పేరును చేర్చలేదు.

ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ నేపథ్యంలో పెద్ద వేదికలపై నిరసనలు తెలుపుతున్నారు. అటువంటి పరిస్థితిలో, ఆస్కార్ వేడుకపై ఎటువంటి ప్రభావం లేకుండా ఉండే విధంగా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news