ముంబైలోని వాంఖడే స్టేడియానికి 50 ఏళ్లు.. సచిన్ స్పెషల్ ట్వీట్

-

ముంబైలోని వాంఖడే స్టేడియాన్ని నిర్మించి 50 సంవత్సరాలు పూర్తవడంపై సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు.’10 ఏళ్లున్నప్పుడు మొదటిసారి వాంఖడే స్టేడియాన్ని చూశా.1983లో వెస్టిండిస్‌ జట్టు ఇండియా పర్యటనకు వచ్చిన సమయంలో స్టేడియంలోకి తొలిసారిగా బాంద్రాలోని స్నేహితులతో కలిసి స్టేడియానికి వచ్చినట్లు గుర్తు చేసుకున్నాడు. కానీ, 5 సంవత్సరాల తర్వాత అదే స్టేడియంలో ముంబై తరఫున అరంగేట్రం చేస్తానని అనుకోలేదు అని పేర్కొన్నారు. 2011 ప్రపంచకప్ ను నా దేశం కోసం గెలవడం నా కెరీర్లో బెస్ట్ మూమెంట్ అని అన్నారు. ఇక్కడే నా 200వ టెస్ట్ మ్యాచ్నూ ఆడా. ఈ స్టేడియంలోనే నా ప్రియమైన ఆటకు వీడ్కోలు పలికా’ అని సచిన్ టెండుల్కర్ పేర్కొన్నారు.

అలాగే, ఇండియా, శ్రీలంక మ్యాచ్ నేపథ్యంలో నవంబర్ ఒకటో తేదీన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గౌరవార్థం ముంబయిలోని వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news