నేడే ఇందిరమ్మ ఇళ్లు పథకం ప్రారంభోత్సవం

-

రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభయహస్తం హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకం, ఆరోగ్య శ్రీ నగదు పెంపు, రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమల్లోకి తీసుకువచ్చింది. ఇప్పుడు మరో హామీ అమలుకు రంగం సిద్ధం చేసింది. ఇవాళ ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.  భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించడం ద్వారా పేదల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు రేవంత్ శ్రీకారం చుట్టనున్నారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా అయిదో హామీని భద్రాచలంలో ప్రారంభిస్తామని ఇటీవలే సీఎం రేవంత్ చెప్పారు. పేదవారి సొంత ఇంటి కల సాకారమైతే వారి ఇంట పండగేనని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏటా 4.50 లక్షల ఇళ్లు నిర్మించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున నిర్మించాలని సూచించారు. ఇందిరమ్మ ఇంటిని లబ్ధిదారుల ఇంట్లోని మహిళ పేరిట మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణానికి తగ్గకుండా ఇంటిని నిర్మించుకోవాలని, ఒక హాల్‌, ఒక బెడ్‌రూమ్‌, వంట గది, బాత్‌రూమ్‌ విధిగా ఉండాలని సూచించారు. తొలివిడతలో సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news