రాజమండ్రిలో గేమ్ ఛేంజర్..స్పెషల్ గెస్ట్‌ ఎవరంటే ?

-

రాజమండ్రి లో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ జరుగనుంది. రాజమండ్రిలో ఈనెల 4వ తేదీన వేమగిరి వేదికగా.. గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ తరుణంలోనే… సభా స్థలాన్ని పరిశీలించి మెగా అభిమానులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవనం స్వామి నాయుడు, చిరంజీవి యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏడిద బాబీ.

game changer

నాలుగవ తేదీన వేమగిరిలో జరిగే మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఈవెంట్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారని వివరించారు రవణం స్వామినాయుడు. హైదరాబాద్ తరహా ఘటన జరగకుండా అభిమానులకు దిశా నిర్దేశం చేసామమన్నారు. పోలీసులు ఇచ్చిన నిబంధనలు మేరకు సుమారు లక్ష మందికి సిట్టింగ్ ఏర్పాటు చేశాం…. అంతకుమించి వచ్చినా జాగ్రత్తలు తీసు కుంటున్నామని తెలిపారు. దేశ చరిత్రలో ఈవెంట్ నిలవనుందన్నారు రమనం స్వామి నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version