పుష్ప 2 ప్రొడ్యూసర్స్ కు తెలంగాణ రాష్ట్ర హై కోర్టు లో ఊరట లభించింది. సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో ప్రొడ్యూసర్లు ఎలమంచిలి రవి శంకర్, నవీన్ పిటిషన్ దాఖలు చేశారు. సంధ్య థియేటర్ ఘటన పై తమ మీద నమోదు చేసిన కేసు ను కొట్టివేయాలని పిటిషన్ వేశారు ప్రొడ్యూసర్లు ఎలమంచిలి రవి శంకర్, నవీన్. థియేటర్ భద్రత తమ పరిధి కాదని పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపించారు. తమ బాధ్యత గా ముందే పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు.
సమాచారం ఇచ్చాము కాబట్టే అంత మంది పోలీసులు అక్కడ ఉన్నారని ప్రొడ్యూసర్లు తరుపు న్యాయవాది పేర్కొన్నారు. అన్ని చర్యలు తీసుకున్నపటికి అనుకొని ఘటన జరిగిందని పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపించారు. జరిగిన ఘటన కు సినిమా ప్రొడ్యూసర్లు నిందితులుగా చేరిస్తే ఎలా అని ప్రశ్నించారు పిటిషనర్ న్యాయవాది. దీంతో సినిమా ప్రొడ్యూసర్లను అరెస్ట్ చేయవద్దని హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.