ఆడ‌వాళ్లు మీకు జోహార్లు.. ఫిబ్ర‌వ‌రి 10న టీజ‌ర్

-

యంగ్ హీరో శ‌ర్మ‌నంద్ హీరోగా నేషన‌ల్ క్ర‌ష్ రష్మిక మంద‌న్నా హీరోయిన్ గా తాజా గా ఆడ‌వాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో నటిస్తున్నారు. కిషోర్ తిరుమల ద‌ర్శ‌కత్వంలో ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంట‌ర్ టైనర్ గా తెర‌కెక్కుతుంది. ఇటీవ‌ల విడుద‌ల అయిన పోస్ట‌ర్ల తో పాటు ఒక పాట‌తో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. అలాగే అంచనాలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. కాగ తాజా ఈ సినిమా గురించి చిత్ర బృందం ట్విట్ట‌ర్ లో ఒక అప్ డేట్ ను అభిమానుల‌తో పంచుకుంది.

ఈ సినిమా టీజ‌ర్ ను ఈ నెల 10 విడుద‌ల చేయ‌నున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించింది. దీంతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యామిలీ ఆడియాన్స్ టీజ‌ర్ కోసం ఆశాగా చూస్తున్నారు. కాగ యంగ్ హీరో శ‌ర్వ‌నంద్ ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ఫ్యామిలీ మూవీస్ చాలా హిట్ అయ్యాయి. ఇప్పుడు కూడా ఆడ‌వాళ్లు మీకు జోహర్లు సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద దుమ్ము లేపుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

కాగ ఇటీవ‌ల దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించిన టైటిల్ సాంగ్ తెలుగు ప్రేక్షకుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంది. అయితే ఈ నెల 10 విడుద‌ల అయ్యే టీజర్ ఎలా ఉంటుందో ఆసక్తి ఇంకా పెరిగిపోతుంది. కాగ ఈ సినిమా ను ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం భావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version