దర్శకత్వం : సుధా కొంగర
నిర్మాత : సూర్య, గుణీత్ మోంగా
సంగీతం : జీవీ ప్రకాష్‌కుమార్
సినిమాటోగ్రఫీ : నికేత్ బొమ్మిరెడ్డి
ఎడిటింగ్ : సతీష్ సూర్య
ఓటీటీ రిలీజ్ : అమెజాన్ ప్రైమ్
రిలీజ్ డేట్ : 12 – 11- 2020
సూర్య.. విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు. తమిళ, తెలుగు భాషల్లో మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న ఆయన గత కొంత కాలంగా వరుస ఫ్లాపులు.. వివాదాలతో సతమతమవుతున్నారు. ఈ టైమ్ సూర్యకు ఓ సాలీడ్ హిట్ కావాలి. అతని కెరీర్‌కి మళ్లీ పూర్వవైభవాన్ని అందించాలి. అలాంటి సినిమా కోసం సూర్యతో పాటు ఆయనని అభిమానించే వాళ్లు ఎదురుచూస్తున్నారు. ఈ దశలో సూర్య డూ ఆర్ డై అనే స్థాయిలో చేసిన చిత్రం `ఆకాశం నీ హద్దురా`. `గురు` ఫేమ్ సుధా కొంగర దర్శకత్వం వహించారు. `సూరరాయిపోట్రు` పేరుతో తమిళంలో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో గురువారం స్ట్రీమింగ్ అవుతోంది. సూర్య సాహసం చేసి నటిస్తూ నిర్మించిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలోనే వుందా? .. అతని అభిమానుల్ని ఈ మూవీ ఎంత వరకు సంతృప్తి పరిచింది. సూర్యకు సాలీడ్ హిట్‌ని అందించిందా అన్నది తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే.
స్టోరీ:
మహా (సూర్య) మధ్య తరగతి యువకుడు. తండ్రి స్కూల్ మాస్టర్.. అతనిపై కోపంతో ఇంటి నుంచి వెళ్లిపోయి ఏయిర్‌ఫోర్స్‌లో చేరతాడు. ధనుకులకు మాత్రమే సొంతమైన విమాన యానాన్ని సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని కలలు కంటాడు. అందు కోసం అవిశ్రాంతంగా శ్రమిస్తాడు. అతనికి అడుగడుగునా అడ్డంకులు.. చీత్కారాలు ఎదురవుతాయి. ఆ దశలో ఇండియాలోనే నంబర్‌వన్ ఏయిర్‌వేస్‌కి అధినేత అయిన పరేష్ గో స్వామి( పరేష్ రావల్)కు తన ఐడియా చెబుతాడు. మహా ఐడియాని తిరస్కరించిన గోస్వామి అది కార్యరూపం దాల్చకుండా అడుగడుగునా అడ్డుతగులుతాడు. ఈ వార్‌లో మహా తను కన్న కలని నిజం చేసుకున్నాడా? ఏయిర్ డెక్కన్‌ని ఏవిధంగా స్థాపించాడు అన్నదే ఇందులో ప్రధాన కథాంశం.
ఎవరెలా చేశారు:
పైలెట్ జి.ఆర్ గోపీనాథ్ జీవిత కథ స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆయన పాత్రలో హీరో సూర్య తనదైన స్టైల్లో నటించి ఆకట్టుకున్నారు. రియలిస్టిక్ మూవీ కావడంతో అత్యంత సహజంగా పాత్రని తెరపై ఆవిష్కరించడానికి సూర్య చాలా శ్రమించారు. సినిమాలో సూర్య నటించాడు అనడం కంటే జీవించాడు అనడం కరెక్టేమో. ప్రతీ సన్నివేశంలో సినిమా చూస్తున్న ప్రేక్షకుడు సూర్య భావాలతో ప్రయాణం చేస్తారు. అంతలా ఆయన పాత్రని సుధా కొంగర మలిచారు. ఒక విధంగా చెప్పాలంటే సూర్యకు టైలర్ మేడ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. నవ్వించి.. ఏడిపించి.. ఆడియన్స్‌తో సూర్య డ్యాన్స్ చేయించాడు.. సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఈ పాత్రని అంతలా ఓన్ చేసుకోవడం మాత్రం గ్యారంటీ.
హీరోయిన్‌గా నటించిన అపర్ణా బాలమురళి కూడా ఏ మాత్రం తగ్గలేదు. సహజ నటనతో సూర్యతో కొన్ని సన్నివేశాల్లో పోటీపడి నటించింది. కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు తన అసలు పేరు భక్తవత్సలం నాయుడు పేరుతో కెప్టెన్‌గా క్రమశిక్షణకు మారుపేరైన పాత్రలో నటించి ఆకట్టకున్నారు. పరేష్ రావల్ యాజ్ యూజ్‌వల్ విలనీని పండించారు. కరుణాస్, ఊర్వశీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నీషియన్స్ పనితీరు ఎలా వుంది:
ఈ సాహసోపేత మూవీని ఎంచుకుని తన సత్తా ఏంటో మరోసారి నిరూపించారు డైరెక్టర్ సుధా కొంగర. డిఫికల్డ్ స్టోరీని ఎంచుకుని దాన్ని తెరపైకి తీసుకొచ్చిన తీరుకు ఆమెని అబినందించాల్సిందే. ఈ తరహా కథలు కొంచెం పట్టు తప్పినా టెంపోని మెయింటైన్ చేయడం కష్టం అది తెలిసి చాలా జాగ్రత్తలు తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సూర్య, గుణీత్ మోగా నిర్మాణ విలువలు బబాగున్నాయి. సహజత్వం కోసం రియల్ లొకేషన్‌లో ఇండియన్ ఏయిర్ వేస్ అధిరిటీ వారి అనుమతలు పొంది పెద్ద సాహసమే చేశారు. అందుకు తగ్గ ఫలితాన్ని అందుకున్నారు. ఈ చిత్రానికి నిఖిత్ బొమ్మిరెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ ప్రధాన హైలైట్‌గా నిలిచింది. జీవీ ప్రకాష్ నేపథ్య సంగీతం.. పాటలు.. సతీష్ సూర్య ఎడిటింగ్ బాగున్నాయి. అయితే సతీష్ సూర్య ఎడిటింగ్ మరింత క్రిస్పీగా వుంటే బాగుండేది.
ప్లస్‌లు:
సూర్య టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్
ఆడియన్స్‌ని కట్టిపడేసే కథ, కథనాలు
గ్రిప్పింగ్ సాగిన ఫస్ట్ హాఫ్
భావోద్వేగ సన్నివేశాలు
హార్ట్ టచ్చింగ్‌గా సాగే క్లైమాక్స్
ఫెంటాస్టిక్ విజువల్స్
మైనస్‌లు:
సెకండ్ హాఫ్ లాగ్ వుండటం
ఆసక్తికరంగా లేని కొన్ని సన్నివేశాలు
మరింత గ్రిప్పింగ్ సెకండ్ హాఫ్ లేకపోవడం
ఫైనల్ వెర్డిక్ట్:
సూర్య నుంచి చాలా కాలంగా కొత్త తరహా చిత్రాన్ని ఆశిస్తున్న ప్రేక్షకులకు అమితంగా నచ్చే సినిమా ఇది.
సుధా కొంగర విజన్‌ని బలంగా నమ్మి సూర్య చేసిన తెలివైన ప్రయత్నమే ఈ సినిమా. ఈ పాండమిక్ సమయంలో సూపర్ హిట్ చిత్రాన్ని ఈ మూవీతో అందించారు సూర్య. అయితే డైరెక్టర్ సుధా కొంగర ఫస్ట్ హాఫ్‌ని నడిపించినంత గ్రిప్పింగ్‌గా సెకండ్ హాఫ్‌ని నడిపించి వుంటే మరింత బాగుండేది. ఆ విషయం పక్కన పెడితే సూర్య నుంచి ఏ తరహా సినిమా కావాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారో చాలా రోజుల తరువాత అదే తరహా చిత్రాన్ని ఈ సినిమాతో అందించారు. ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పక్కాగా చెప్పాలంటే `ఆకాశమే హద్దురా` ఓ ఎమోషనల్ జర్నీ.. ప్రతీ ఒక్కరి మనసుని హత్తుకుంటుంది.
రేటింగ్ : 3.5