అమ‌లాపాల్ ఆమె మూవీ రివ్యూ

-

మూవీ: ఆమె
న‌టీన‌టులు: అమలాపాల్, ర‌మ్య సుబ్ర‌హ్మ‌ణ్య‌న్‌, శ్రీ‌రంజ‌ని, వివేక్ ప్ర‌స‌న్న
సంగీతం: ప‌్ర‌దీప్ కుమార్
నిర్మాత‌లు: రాంబాబు క‌ల్లూరి, వియ్ మోర‌వెనేని
ద‌ర్శ‌క‌త్వం: ర‌త్న‌కుమార్

త‌మిళ న‌టి అమ‌లాపాల్ తాజా చిత్ర ఆమె.. విడుద‌ల‌కు ముందే ఎంతో సంచ‌ల‌నాన్ని సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీకి చెందిన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌లో అమ‌లాపాల్ ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా న‌గ్నంగా క‌నిపించి అంద‌రినీ షాక్‌కు గురిచేసింది. ఆ త‌రువాత ఈ మూవీపై.. ముఖ్యంగా ఇందులో అమ‌లాపాల్ న‌ట‌న‌పై అంద‌రూ త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేశారు. అయితే చాలా మంది అమ‌లాపాల్‌కు మ‌ద్ద‌తునిచ్చారు. ఇలాంటి క్యారెక్ట‌ర్ చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాల‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా ఇవాళ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఇందులో అమ‌లాపాల్ ఏవిధంగా ఆక‌ట్టుకుందో ఇప్పుడు చూద్దాం..!

Amala Paul’s Aame Movie Review

క‌థ‌:

కామిని (అమ‌లాపాల్‌) పూర్తిగా వెస్ట్ర‌న్ క‌ల్చ‌ర్‌ను ఫాలో అవుతుంటుంది. త‌న స్నేహితురాళ్ల‌తో ఎప్పుడూ ఏదో ఒక విష‌య‌మై బెట్ క‌డుతూ జీవితాన్ని జాలీగా గ‌డుపుతూ ఉంటుంది. అయితే ఎప్పుడు బెట్ కాసినా కామినికి గెల‌వ‌డ‌మే ఇష్టం. ఈ క్ర‌మంలోనే ఒక రోజు ఈమె త‌న స్నేహితురాళ్ల‌తో క‌లిసి పీక‌ల‌దాకా మ‌ద్యం సేవిస్తుంది. అనంత‌రం కామిని ఇంటికి వెళ్ల‌దు. దీంతో త‌న కూతురు ఇంటికి రాక‌పోయేస‌రికి కామిని త‌ల్లి పోలీసుల‌కు కంప్లెయింట్ చేస్తుంది. ఆ త‌రువాత కామిని ఒక పాడుబ‌డ్డ బంగ్లాలో ఒంటి మీద నూలు పోగు లేకుండా క‌నిపిస్తుంది. అదే స్థితిలో ఆమెకు మెళ‌కువ వ‌స్తుంది. దీంతో ఆమె ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌వుతుంది. అయితే ఆమె అస‌లు ఆ బంగ్లాకు ఎందుకు చేరుకుంది ? ఆమె న‌గ్నంగా ఎందుకు ప‌డి ఉంది ? అస‌లు ఆ రోజు ఏం జ‌రిగింది ? చివ‌ర‌కు క‌థ ఏమ‌వుతుంది ? అన్న వివ‌రాల‌ను తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెర‌పై చూడాల్సిందే..!

న‌టీన‌టుల ప‌నితీరు:

ఆమె సినిమాను అమ‌లాపాల్ ఒంటి చేత్తో న‌డిపించింద‌నే చెప్ప‌వ‌చ్చు. సినిమాలో అమ‌లాపాల్ న‌ట‌న ఒక రేంజ్‌లో ఉంటుంది. ఈ సినిమాలో ఆమె న‌ట‌నలో విశ్వ‌రూపం చూపించింద‌నే చెప్ప‌వ‌చ్చు. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా వ‌చ్చిన ఈ మూవీలో సీన్ సీన్‌లోనూ అమ‌లాపాలే మ‌న‌కు క‌నిపిస్తుంది. ఎక్క‌డా మూవీ బోర్ కొట్ట‌దు. సినిమా మొద‌టి భాగం మొత్తం కామిని ఇంట్ర‌డక్ష‌న్‌, ఆమె జీవ‌నం, స్నేహితురాళ్లో క‌లిసి ఆమె చేసే హంగామా మ‌న‌కు క‌నిపిస్తాయి. ఆ త‌రువాత భాగంలో అసలు క‌థ మొద‌ల‌వుతుంది. సినిమా రెండో భాగంలో వ‌చ్చేకొన్ని స‌స్పెన్స్ సీన్లు ప్రేక్ష‌కుల‌లో ఉత్కంఠ‌ను క‌లిగిస్తాయి. త‌రువాత ఏం జ‌రుగుతుందో తెలుసుకోవాల‌న్న ఉత్సుక‌త వారిలో క‌లుగుతుంది. ఇక క్లైమాక్స్‌లో ఇచ్చే ఫినిషింగ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది.

ఆమె మూవీ లేడీ ఓరియెంటెడ్ మూవీ అయినా.. అందులో కావ‌ల్సినంత స‌స్పెన్స్ ఉండ‌డంతో జ‌నాల‌కు థ్రిల్ అనిపిస్తుంది. అలాగే ఈ సినిమా ద్వారా ద‌ర్శ‌కుడు స‌మాజానికి చ‌క్క‌ని మెసేజ్ కూడా ఇచ్చారు. ఈ క్ర‌మంలో ఈ మూవీ ప‌ట్ల మొద‌ట్లో ఎన్ని వివాదాలు వ‌చ్చాయో.. ఇప్పుడు అన్ని పొగ‌డ్త‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌నే చెప్పాలి. ఈ మూవీని అమ‌లాపాల్ మొత్తం ద‌గ్గ‌రుండి న‌డిపిస్తూ.. క్రెడిట్ మొత్తాన్ని ఆమే కొట్టేసింది. ఇక మూవీలో న‌టించిన మిగిలిన న‌టీన‌టులు కూడా త‌మ త‌మ పాత్ర‌లకు న్యాయం చేశారు. అలాగే ఈ మూవీని చ‌క్క‌ని ప్రొడ‌క్ష‌న్ విలువ‌ల‌తో తెరకెక్కించార‌ని దీన్ని చూస్తే మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది. విజ‌య్ కార్తీక్ సినిమాటోగ్ర‌ఫీ బాగుంటుంది. మ్యూజిక్‌కు ఈ మూవీలో పెద్ద‌గా స్కోప్ లేక‌పోయినా.. బ్యాక్‌గ్రౌండ్ స్కోరును సీన్ల‌కు త‌గిన‌ట్లు అందించారు.

చివ‌రిగా అమ‌లాపాల్ న‌టించిన ఆమె మూవీ ప్రేక్ష‌కుల‌కు చ‌క్క‌ని థ్రిల్‌ను అందిస్తుంది. మూవీలో ఉండే స‌స్పెన్స్ సీన్లు ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటాయి. స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్ మూవీల‌ను ఇష్ట‌పడేవారు ఈ మూవీని క‌చ్చితంగా చూడ‌వ‌చ్చు. ఓవ‌రాల్‌గా ఆమె మూవీ ప్రేక్ష‌కుల‌కు గూస్ బంప్స్ తెప్పించే మెసేజ్ ఓరియెంటెడ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ అని చెప్ప‌వ‌చ్చు.

ఆమె మూవీ రేటింగ్‌: 3/5.0

Read more RELATED
Recommended to you

Latest news