విజయ్ దేవరకొండకు ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ నిర్మాణ సంస్థ షాక్.. రూ.8 కోట్లు ఇవ్వాలంటూ..

-

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకు సోషల్ మీడియా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన కొత్త చిత్రం ‘ఖుషి’ సినిమా సంపాదనలోంచి రూ. కోటిని అభిమానులకు ఇస్తానని యంగ్‌ విజయ్‌ దేవరకొండ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ అభిషేక్‌ పిక్చర్స్‌ ట్వీట్ చేసింది. ఈ సినిమాను పంపిణీ చేసి రూ. 8 కోట్లు నష్టపోయామని, అందుకు తమకూ సాయం అందించాలంటూ ట్వీట్​లో కోరింది.

Vijay Devarakonda will give a gift of Rs

‘‘డియర్‌ విజయ్‌ దేవరకొండ! వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సినిమా పంపిణీలో రూ.8 కోట్లు నష్టపోయాం. కానీ, దానిపై ఎవరూ స్పందించలేదు. మీరు దయా హృదయంతో రూ. కోటిని పలు కుటుంబాలకు అందివ్వనున్నారు. మా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలకు కూడా సాయం చేసి ఆదుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని ట్వీట్‌లో పేర్కొంది. ఈ ట్వీట్​పై ప్రస్తుతం నెట్టింట రచ్చ జరుగుతోంది.

విజయ్‌ హీరోగా 2020లో వచ్చిన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ను అభిషేక్‌ పిక్చర్స్‌ ఆంధ్రప్రదేశ్‌లో డిస్ట్రిబ్యూట్‌ చేసింది. ‘కేశవ’, ‘సాక్ష్యం’, ‘గూఢచారి’, ‘రావణాసుర’ తదిరత చిత్రాలు ఈ సంస్థలో రూపొందినవే.

Read more RELATED
Recommended to you

Latest news