బైడెన్​కు కరోనా నెగిటివ్.. షెడ్యూల్ ప్రకారమే ఇండియా టూర్.. వైట్ హౌస్ ప్రకటన

-

ఈనెల 9, 10వ తేదీల్లో దిల్లీలో జరగనున్న జీ-20 శిఖరాగ్ర సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు వస్తారా లేదోననే సంకోచం ఉన్న విషయం తెలిసిందే. అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌కు కరోనా నిర్ధరణ కాగా.. జో బైడెన్‌ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఇక తాజాగా దీనిపై వైట్ హౌస్ ప్రకటన జారీ చేసింది. జో బైడెన్‌ షెడ్యూల్‌ ప్రకారం భారత్‌కు రానున్నట్లు స్పష్టం చేసింది.

సోమ, మంగళవారం చేసిన కొవిడ్‌ పరీక్షల్లో అమెరికా అధ్యక్షుడికి నెగిటివ్‌ వచ్చిందని ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవాన్ తెలిపారు. బైడెన్‌ గురువారం.. దిల్లీ బయల్దేరుతారని, శుక్రవారం ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారని వెల్లడించారు. అనంతరం ఈనెల 9, 10వ తేదీల్లో జరిగే .. బైడెన్‌ పాల్గొంటారని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిసి పనిచేయడానికి అమెరికా కట్టుబడి ఉందని చెప్పారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు సవాలులో కూడా కలిసి పనిచేయగలవన్న నమ్మకాన్ని ఈ సమావేశం కలిగిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news