GET READY : సాయంత్రం 5:49 గంటలకు “ఆచార్య” ట్రైలర్

-

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న తాజా మూవీ ఆచార్య. ఈ ఆచార్య సినిమాకు టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా… మరో జంటగా రామ్ చరణ్ అలాగే పూజా హెగ్డే నటిస్తున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాను భారీ బడ్జెట్ తో చేస్తున్నారు. ఈ సినిమాకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది.

ఈ సినిమా ట్రైలర్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ సినిమా ట్రైలర్ ను ఇవాళ సాయంత్రం 5.49 గంటలకు థియేటర్ లలో, 7.02 గంటలకు యూట్యూబ్ లో విడుదల చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు చిన్న ప్రోమో రిలీజ్ చేసింది. కాగా.. ఈ మూవీ ఏప్రిల్‌ 29 వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version