వర్రా రవీంద్రారెడ్డి కేసులో హైకోర్టు కీలక ఆదేశం..!

-

వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి హెబియస్ కార్పస్ పిటిషన్ పై హై కోర్టు తాజాగా విచారణ జరిపింది. అయితే ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన వర్రాకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే వర్రాను అక్రమ నిర్భంధం చేసి ఆ విషయం కప్పి పుచ్చటానికి ఇతర అంశాలు క్రియేట్ చేశారని కోర్టుకు తెలిపారు పిటిషనర్ అడ్వకేట్. అలాగే హెడ్ క్వార్టర్ నుంచి డీఐజీని పంపి అరెస్టు అంశం పై ఇంటర్వ్యూలు.. కావాలని ఇప్పించారని కోర్టుకు వివరించారు పిటిషనర్.

అయితే హై కోర్టులో వర్రాను హాజరు పరచాలని హై కోర్టు ఆదేశాలు ఇస్తే దిగువ కోర్టులో హాజరు పరిచినట్టు కోర్టు దృష్టికి తెచ్చారు పిటిషనర్. ఇక ఈ కేసులో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వం సహా ప్రతివాదులకు హై కోర్టు ఆదేశం ఇవ్వగా.. పౌర హక్కులను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు పిటిషనర్. అయితే వర్రా అరెస్టు పై పుల్లూరు టోల్ ప్లాజా సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చిన హై కోర్టు.. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version