మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ మహాయుతికే జై కొడుతున్నాయి. ఇక్కడ మొత్తం మొత్తం 288 స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 145. అయితే పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం.. అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ 102 – 120, ఏక్నాథ్ శిండే శివసేన 42 – 61, ఎన్సీపీ14 – 25 స్థానాలు దకించుకునే ఛాన్స్ ఉంది. ఇక కాంగ్రెస్ 24 – 44, శివసేన 21 -36, ఎన్సీపీ 28 – 41 స్థానాలు.. ఇతరులకు 6 – 12 స్థానాలు ఇచ్చింది పీపుల్స్ పల్స్.
ఇక ఓటింగ్ పెర్సెంటేజ్ చూసుకుంటే.. మహాయుతికి 49.8%, ఎమ్వీఏకి 40.1%, ఇతరులకు 10.1% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో పార్టీల పరంగా చూస్తే.. బీజేపీ 31.3%,ఏక్నాథ్ శిండే శివసేన 14.5%, కాంగ్రెస్ 13.7%, యూబీటీ శివసేన 13%, ఎన్సీపీ 10.1%, ఎన్సీపీ 4%, ఇతరులకు 13.4% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు పీపుల్స్ పల్స్ పేర్కొంది.