తిరుపతి రూరల్.. వేదాంతపురంలో విజయవాడ చెందిన నిందితుడి ఆత్మహత్య కేసులో ట్విస్ట్ వచ్చింది. అయితే విజయవాడకు చెందిన నీలం సూర్య ప్రభాస్ పై రెండు ఫోక్సో, దొంగతనాలు, దోపిడి కేసులు ఉన్నాయి. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులలో మరికొన్ని కేసులు ఉన్నాయి. అయితే అరెస్ట్ కు భయపడి నెల క్రితం భార్య బిడ్డలతో వేదాంతపురంకు మకాం మార్చాడు సూర్య ప్రభాస్.
కానీ పక్కా సమాచారంతో అరెస్ట్ చేసేందుకు వేదాంతపురంకు వచ్చారు ఏలూరు జిల్లా, లక్కవరం ఎస్ఐ రామకృష్ణ, జంగారెడ్డిగూడెం క్రైం ఏఎస్ఐ సంపత్ కుమార్, ముగ్గురు పీసీలు. కానీ పోలీసుల రాకను గమనించి ఇంటి గడియ పెట్టుకున్నాడు సూర్య ప్రభాస్. అరెస్ట్ చేస్తారన్న భయంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు సూర్య ప్రభాస్. కానీ మంటలను ఆర్పి రుయా ఆసుపత్రికి పోలీసులు తరలిస్తుండగా.. మార్గం మధ్యలో మృతి చెందాడు సూర్య ప్రభాస్. ఇక సూర్య ప్రభాస్ మృతితో భార్య హారిక, 5 నెలల పసికందు అనాథలయ్యారు.ఇక ఈ విషయంలో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు తిరుచానూరు పోలీసులు.