జార్ఖండ్ బీజేపీదే అంటూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. జార్ఖండ్ లో మొత్తం 81 స్థానాలు ఉండగా.. అధికారం కోసం మ్యాజిక్ ఫిగర్ 41. అయితే జార్ఖండ్ లో ఎన్డీయే కూటమిలోని బీజేపీ 42-48, ఏజేఎస్‌యూ 2-5 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ తెలిపింది. అలాగే ఇండియా కూటమి ఉన్న జేఎమ్‌ఎమ్16-23, కాంగ్రెస్ 8-14 గెలిచే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. అదే విధంగా ఇతరులు 6-10 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టు సర్వేలో వెల్లడించింది.
ఇక ఓట్ల శాతం చూస్తే.. బీజేపీ 42.1%, ఏజేఎస్‌యూ 4.6%, కాంగ్రెస్ 16.2%, జేఎమ్‌ఎమ్ 20.8 %, ఇతరులు 16.3% ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో ఎస్సీలు, ముస్లింలు, క్రిస్టియన్లు ‘ఇండియా’ కూటమి వైపు ఉంటె.. ఎస్టీలు ఇండియా, ఎన్డీయే రెండు కూటముల మధ్య చీలి ఉన్నట్లు పీపుల్స్ పల్స్ పేర్కొంది. అలాగే అగ్రవర్ణాలు, ఓబీసీలు ఎన్డీయేకు అనుకూలంగా ఉన్నారు అని ప్రకటించింది.