ట్రెండ్ ఇన్: మెగా మేనియా షురూ..అభిమానులు సంబురాలు..అదరగొట్టనున్న ‘ఆచార్య’

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్ర ట్రైలర్ మంగళవారం సాయంత్రం విడుదల కానుంది. ‘సైరా నరసింహారెడ్డి’ పిక్చర్ లో చివరగా ప్రేక్షకులకు కనిపించిన చిరు.. ఆ సినిమా తర్వాత ఇప్పుడు మళ్లీ అభిమానులు, సినీ ప్రేక్షకులను పలకరించనున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 153 థియేటర్స్ లో ఈ పిక్చర్ ట్రైలర్ ను మంగళవారం సాయంత్రం 5.43 గంటలకు విడుదల చేయనున్నారు.

ఈ క్రమంలోనే మెగా అభిమానులు సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. తమ అభిమాన నటుడు అయిన చిరంజీవి ఆయన తనయుడు రామ్ చరణ్ ను వెండితెరపైన చూసేందుకు వేచి చూస్తున్నారు. ట్విట్టర్ వేదికగా #AcharyaTrailer ఆచార్య ట్రైలర్ హ్యాష్ ట్యాగ్ ట్వీట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ఆచార్య ట్రైలర్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. యూట్యూబ్ లో ఈ పిక్చర్ ట్రైలర్ 7.02 గంటలకు విడుదల కానుంది.

మెగా అభిమానులు ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘బాస్ ఈసారి రికార్డులు తిరగరాస్తాడని, తండ్రీ తనయులు అదరగొడతారు’ అని కామెంట్స్ చేస్తున్నారు. ‘భరత్ అనే నేను’ చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ కు మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశారు. చెర్రీకి జోడీగా పూజా హెగ్డే నటించగా, చిరు సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటించింది. ఈ నెల 29న పిక్చర్ విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version