దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఒక పార్లమెంట్, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు ఈరోజు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లోని అసన్ సోల్ పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు బల్లి గంజ్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండు స్థానాల్లో కూడా గతంలో బీజేపీలో ఉండీ ప్రస్తుతం టీఎంసీ పార్టీలో కొనసాగుతున్న వ్యక్తులే పోటీ చేస్తున్నారు. గతంలో బీజేపీలో ఉండి ప్రస్తుతం టీఎంసీలో ఉన్న శత్రుఘ్న సిన్హా అసన్ సోల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా….బీజేపీ నుంచి అసన్ సోల్ దక్షిణ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ ను రంగంలోకి దించింది.
బెంగాల్ బై ఎలక్షన్స్… అసన్ సోల్ లో చెలరేగిన హింస
-