ఎవ్వరి సపోర్టు లేదు. ఎవరి అండదండలూ లేవు. తన ట్యాలెంట్ ను మాత్రమే నమ్ముకుని ఇండస్ట్రీకి వచ్చాడు. తన లాగే ఎంతో మంది ట్యాలెంట్ ఉన్న వారు ఎదిగి చూపించారు కాబట్టి తనకు కూడా ఇండస్ట్రీ దారి చూపిస్తుందని నమ్మాడు. చివరికి అతడి నమ్మకం నిజమైంది. అతడే ట్యాలెంటెడ్ హీరో కార్తికేయ. మంచి హైట్, లుక్, డ్యాన్స్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
ఇక ఈ హీరో మొదటి సినిమా ఆర్ ఎక్స్ 100 ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో మనోడికి వరుస ఆఫర్లు వచ్చాయి. అయితే దీని తర్వాత వచ్చిన ఏ సినిమా మనోడికి పెద్దగా పేరు తీసుకురాలేదు. ఈ క్రమంలో టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్, సక్సెస్ ఫుల్ బ్యానర్ గా పేరుపొందిన గీతా ఆర్ట్స్ బ్యానర్ లో కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో, హీరోయిన్లుగా చావు కబురు చల్లగా సినిమా రూపొందింది. మొదటి నుంచి ఇంట్రెస్టింగ్ ఉండటంతో అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. అయితే టీజర్, ట్రైలర్ లో ఉన్న దమ్ము సినిమాలో లేదని తేలిపోయింది. థియేటర్లలో ఈ మూవీ డిజాస్టర్ అయింది. రూ.14.5 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ కేవలం 3.43కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.
దీంతో హీరో, డైరెక్టర్ కౌశిక్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ బాధ పడ్డారు. ఇక తమ మూవీని రీ ఎడిట్ చేసి మరీ ఓటీటీలో విడుదల చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. థియేటర్లలో బోర్ కొట్టించిన సినిమా.. ఓటీటీలో మాత్రం సూపర్ హిట్ అందుకుంది. రీ ఎడిట్ చేసి రిలీజ్ చేయడంతో.. ఆహా యాప్ లో అత్యధిక వేగంగా 100 మిలియన్ మినిట్స్ వ్యూయర్ షిప్ అందుకుందని.. గీతా ఆర్ట్స్ వారు స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అంటే సినిమా ఎంత బాగా ఆడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా.. కార్తికేయ మొత్తానికి గట్టున పడ్డాడనే చెప్పాలి.