తమిళ చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులు ఎక్కువైపోతున్నాయని నటి కుట్టి పద్మిని అన్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రలో హీరోయిన్లు డబ్బుల కోసం లైంగిక వేధింపులు భరిస్తున్నారని తెలిపారు తమిళ కుట్టి పద్మిని. తాజాగా జాతీయ మీడియాకు కుట్టి పద్మిని ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
లైంగిక వేధింపుల ఆరోపణలపై మలయాళ చిత్ర పరిశ్రమలో భారీ కుదుపులు చోటు చేసుకుంటున్నాయి. అయితే.. ఈ అంశంపై ప్రముఖ నటి, నిర్మాత కుట్టి పద్మిని స్పందించారు.

Actor Kutti Padmini Says Harassment Rampant in Tamil Film Industry
లైంగిక వేధింపులను భరించలేక చాలా మంది మహిళలు “ఆత్మహత్య” చేసుకున్నారన్నారు. గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలను లేవనెత్తిన గాయని చిన్మయి, నటి శ్రీరెడ్డిపై తమిళ చిత్ర పరిశ్రమ నిషేధం విధించడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. లైంగిక వేధింపులు ఎదురైనా..సరైనా ఆధారాలు లేక చాలా మంది మహిళలు ఫిర్యాదు చేయరన్నారు. కానీ కొంత మంది మహిళలు బాగా సంపాదిస్తారు కాబట్టి వేధింపులు సహిస్తారు అని ఆమె తెలిపారు.