డ్రగ్స్‌ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి నవదీప్‌ను ప్రశ్నిస్తున్న ఈడీ

-

హైదరాబాద్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్​కు ఇటీవలే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనెల 10వ తేదీన ఈడీ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నవదీప్ ఇవాళ ఈడీ అధికారుల ఎదుట నటుడు విచారణకు హాజరయ్యాడు. మాదాపూర్ డ్రగ్స్ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు భావిస్తున్నారు.

Narcotic Bureau searches at hero Navdeep's house

ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ కేసులో నిందితులతో నవదీప్​కు సంబంధాలున్నాయని గుర్తించిన ఈడీ అధికారులు ఈ వ్యవహారంలో ఆయన పాత్రపై ఆరా తీస్తున్నారు. మత్తు పదార్థాలు విక్రయించే వారితో ఆయనకున్న ఆర్థిక సంబంధాలు, తన బ్యాంకు ఖాతాల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలు, తదితర అంశాలపై లోతుగా విచారిస్తున్నారు. గతంలోనూ నవదీప్‌ను ఈడీ విచారించింది. మాదాపూర్‌లోని డ్రగ్స్ పార్టీలో మరోసారి నవదీప్ పేరు తెరపైకి రావడంతో ఈ వ్యవహారంలోనూ మత్తు పదార్థాలు విక్రయించే వారితో ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. ఇందులో భాగంగానే విచారణకు హాజరు కావాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు నవదీప్‌ హాజరయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news