నేను ఆరోగ్యంగానే ఉన్నా.. ఆందోళన వద్దు: సాయాజీ షిండే

-

అనారోగ్యం కారణంగా ప్రముఖ నటుడు సాయాజీ షిండే కొన్నిరోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. తన ఆరోగ్య పరిస్థితిపై అప్‌డేట్‌ ఇస్తూ తాజాగా ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు త్వరలోనే తిరిగి వస్తానని అన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘గెట్‌ వెల్‌ సూన్‌’ అంటూ కామెంట్స్‌ పెట్టారు.

సాయాజీ షిండే ఈ నెల 11వ తేదీన ఛాతీ నొప్పితో ఇబ్బందిపడటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను మహారాష్ట్రలోని సతారాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పలు పరీక్షల అనంతరం గుండెలో కొన్ని బ్లాక్స్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. సాయాజీ షిండే ఈసీజీలో స్వల్ప మార్పులు గుర్తించినట్లు తెలిపారు. యాంజియోగ్రఫీ అనంతరం గుండెలో కుడివైపు 99 శాతం బ్లాక్స్‌ గుర్తించడంతో వెంటనే యాంజియోప్లాస్టీ చేశామని వైద్యులు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన సాయాజీ షిండే నటుడిగా తెలుగువారికి సుపరిచితులు. ‘ఠాగూర్‌’తో  ప్రేక్షకులకు చేరువైన షిండే టాలీవుడ్‌లో తెరకెక్కిన చాలా చిత్రాల్లో ప్రతి నాయకుడు, సహాయనటుడి పాత్రలు పోషించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version