సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్స్ తో సూపర్ సక్సెస్ ను చూసి.. ఆ తర్వాత రాజకీయ రంగంలో అడుగు పెట్టి అక్కడా విజయం అందుకున్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను చూస్తే గర్వంగా ఉందని కన్నడ నటుడు ఉపేంద్ర అన్నారు. ఆయన సిద్ధాంతాలతో ఆంధ్రప్రదేశ్‌లో మార్పొస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు. తాను నటించిన ‘ఏ’ (A) సినిమా రీరిలీజ్ కానున్న సందర్భంగా ఉపేంద్ర హైదరాబాద్ వచ్చారు. సినిమా ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ గురించి ప్రశ్న ఎదురవగా స్పందించారు. గతంలో ఒకసారి మాత్రమే పవన్‌ను కలిశానని గుర్తుచేసుకున్నారు.
“ఫండ్స్, లీడర్స్, ఫేమ్, వ్యక్తుల పేరు చూసి ఓటెయ్యడం.. పాలిటిక్స్ అంటే చాలామంది అభిప్రాయం ఇదే. నా ఉద్దేశంలో ఫండ్ లేకుండా పార్టీ ముందుకెళ్లాలి. ఆ విషయంలో ప్రజలే చొరవ తీసుకోవాలి. అప్పుడే అది అసలైన పీపుల్స్ పార్టీ అవుతుంది. నేను ‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ’ అధ్యక్షుడిగా పని చేస్తున్నానే తప్ప ఎన్నికల్లో పోటీ చేయను. నా కుటుంబ సభ్యులూ చేయరు’’ అని ఉపేంద్ర సమాధానమిచ్చారు