క్యా ప్లాన్ హై గురూ.. ‘రూ.950 కోట్లు కొట్టేసి ..వాటి ప్లేస్​లో నల్ల కాగితాలు పెట్టేసి’

-

ఓ చాక్లెట్‌ కంపెనీ యజమాని ఇంట్లో రూ.950 కోట్ల నల్లధనం ఉందన్న పుకార్లు నమ్మిన ఓ దొంగల ముఠా, దోపిడీ చేసి ఆ నగదు స్థానంలో నల్లరంగులో ఉండే కాగితాలు ఉంచి పరారవ్వాలని ప్లాన్ వేశారు. అది కాస్తా బెడిసికొట్టి అడ్డంగా పోలీసులకు దొరికిపోయి జైలు పాలయ్యారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధి ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన బోగిని జంగయ్య అనే స్థిరాస్తి వ్యాపారి  చేసేవాడు. ఇతనికి మన్సూరాబాద్‌కు చెందిన డ్రైవరు శేఖర్‌రెడ్డి, ఇసుక వ్యాపారి ఎండీ మైమూద్‌తో స్నేహముంది. వ్యాపారాల్లో నష్టపోయిన ముగ్గురూ అడ్డదారుల్లోనైనా డబ్బు సంపాదించాలని పథకం వేశారు. తుర్కయాంజల్‌ శ్రీరామ్‌నగర్‌లో నివాసముండే ఓ చాక్లెట్‌ కంపెనీ యజమాని తిరుమనతురై ఇంట్లో రూ.950 కోట్ల నల్లధనం ఉందని బోగిని జంగయ్యకు ఓ వ్యక్తి ద్వారా తెలిసింది.రూ.950 కోట్ల నల్లధనాన్ని ఎలాగైనా కొట్టేయాలని అంతా కలిసి పథకం వేశారు.

మే 4 అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో చాక్లెట్ కంపెనీ యజమాని తిరుమనతురై ఇంటికెళ్లారు. ఇంట్లోకి ప్రవేశించాక వాచ్‌మెన్‌ సహా యజమాని కుటుంబ సభ్యులు ఉండడం చూసి వెనుదిరిగారు. మళ్లీ ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి 1 గంటకు మళ్లీ తిరుమనతురై ఇంట్లోకి ప్రవేశించి కొందరు వెనుకభాగం నుంచి మొదటి అంతస్తులోకి ప్రవేశించారు. నిందితులు ప్రధాన ద్వారాన్ని ఆయుధాలతో ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తుండగా అలికిడి రావడంతో యజమాని తిరుమనతురై అప్రమత్తమై సీసీ కెమెరాలను పరిశీలించాడు. కొందరు ఇంట్లోకి వస్తున్నట్లు గుర్తించి డయల్‌ 100కు సమాచారమిచ్చాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునేలోపు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేసి సీసీ పుటేజీలు పరిశీలించగా నిందితుల గుట్టు బయటపడింది.

Read more RELATED
Recommended to you

Latest news