కోలీవుడ్ నటుడు ప్రస్తుతం రత్నం సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని డైరెక్టర్ హరి తెరకెక్కించాడు. ఏప్రిల్ 26వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విశాల్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. అయితే విశాల్ సినిమా ప్రమోషన్ కంటే ఎక్కువ ఆయన రాజకీయ ఎంట్రీ గురించే ఈ ఈవెంట్లలో చర్చ జరుగుతోంది.
ఇక తాజాగా ఆయన సేలంలో పర్యటించగా అక్కడ మీడియా వారు మరోసారి విశాల్ రాజకీయ అరంగేట్రం గురించి అడిగారు. దానికి విశాల్ స్పందిస్తూ.. రాజకీయ పార్టీలు ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తే, తనలాంటి వారు ఎల్లప్పుడూ ఓటర్లగానే మిగిలిపోతారని అన్నారు. రాజకీయాల్లోకి వస్తానని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీతో బరిలో దిగుతానని విశాల్ ప్రకటించిన విషయం తెలిసిందే.
“గ్రామాల్లో ప్రజలకు అవసరమైన వసతులు పూ ర్తిస్థాయిలో లేవు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వాటిని అందివ్వాలి. అన్నాడీఎంకే, డీఎంకే అని ఏ పార్టీని విమర్శించడం లేదు. పార్టీలు మంచి చేస్తే నేను రాజకీయాల్లోకి రానవసరం లేదు. నటుల సంఘం భవనాన్ని ఈ ఏడాది చివరిలోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నాం. భవనానికి విజయకాంత్ పేరు పెట్టడంపై జనరల్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.” అని విశాల్ చెప్పారు.