గ్లామర్ డోస్ పెంచేసిన డింపుల్ హయాతి.. షర్ట్ బటన్స్ విప్పేసి మరీ..

-

డింపుల్ హయాతి గుర్తుంది కదా. అదేనండి.. గద్దలకొండ గణేష్ సినిమాలో సూపర్ హిట్టు నీ హైటు అంటూ కుర్రకారును ఓ ఊపు ఊపేసింది. ఆ తర్వాత రవితేజతో కలిసి ఖిలాడీలో ఆడిపాడింది. ఆ తర్వాత ఇటీవల గోపిచంద్ తో కలిసి రామబాణంలో నటించి అలరించింది. అయితే ఈ బ్యూటీకి అడపాదడపా అవకాశాలు వచ్చినా.. ఇప్పటి వరకు ఒక్క హిట్టు రాలేదు. డింపుల్ తెలుగమ్మాయే అయినా టాలీవుడ్ లో అంతగా అవకాశాలు అందుకోలేక పోయింది.

ఇక ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్. అవకాశాలు లేకపోయినా ఫేడ్ అవుట్ అయిపోకుండా.. అభిమానులు తనను గుర్తు పెట్టుకునేలా తరచూ ఫొటోషూట్స్ చేస్తూ ఆ ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్సులో డింపుల్ తన అందాలతో మతిపోగొట్టింది. బ్లాక్ అండ్ వైట్ షర్ట్ వేసి.. షర్ట్ వి రెండు మూడు బటన్స్ విప్పి తన ఎందాలను ఆరబోసింది. ఇక కసిగా చూస్తూ కైపెక్కించే పోజులిస్తూ కుర్రకారు గుండెను బేజారు చేసింది.

ఈ ఫొటోలు చూసి కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అయిపోతోంది. సూపర్ హిట్టు భామ సూపర్ హాట్ గా ఉందంటూ కామెంట్లు పెడుతోంది. ఈ చల్లని వర్షంలో.. ఈ మాత్రం హీట్ పుట్టించాల్సిందేనంటూ మరికొందరు హాట్ ఎమోజీస్.. ఫైర్ ఎమోజీస్ కామెంట్ బాక్సుల్లో నింపేస్తున్నారు. ప్రస్తుతం డింపుల్ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news