టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రముఖ నటీనటులు వివిధ కారణాలవల్ల మరణించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నటి జయప్రద ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నటి జయప్రద సోదరుడు రాజబాబు మరణించారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఎమోషనల్ కూడా అయ్యారు నటి జయప్రద. హైదరాబాదులోని… నివాసంలో రాజబాబు… నిన్న సాయంత్రం మరణించినట్లు జయప్రద వెల్లడించారు. తన సోదరుడి ఆత్మకు శాంతి చేకూరాలని… కోరారు నటి జయప్రద. ఇవాళ.. జయప్రద సోదరుడు రాజబాబు అంతక్రియలు జరగనున్నాయి.