ప్రముఖ నటి కల్పిక గణేష్.. ఈమె పేరు ఎవరికి పెద్దగా తెలియక పోయినప్పటికీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సమంతకు అక్క పాత్రలో నటించిన నటి అంటే మాత్రం అందరికీ వెంటనే గుర్తుకు వస్తుంది. అయితే, నటి కల్పికా గణేష్ ఇటీవలే హీరోయిన్ సమంతలాగే తాను కూడా 13 ఏళ్లుగా మయోసైటిస్ తొ పోరాడుతున్నట్లు తెలిపింది.
ఈ క్రమంలోనే తాజాగా కల్పిక ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. లుంబార్ రాడిక్యూలో పథి విజయవంతమైందని తెలిపింది. నా పోరాటం చివరికి ఎలాంటి సత్ఫలితాలను ఇస్తుందో చూడాలి అని రాసుకొచ్చింది. రాడిక్యులర్ పెయిన్ కు ఆమె ఈ చికిత్స చేయించుకుంది. రాడిక్యులర్ పెయిన్ అంటే వెన్నుముక నుంచి నడుము, తొడలు, పాదాల వరకు తీవ్రంగా నొప్పి ఉంటుంది.
ప్రయాణం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జులాయి, పడి పడి లేచే మనసు, యశోద చిత్రాలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కల్పిక గణేష్ ఇటీవలే సమంత లాగే తాను కూడా 13 ఏళ్లుగా మాయోసైటీస్ తో పోరాడుతున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే తాజాగా కల్పిక ఆసుపత్రి బెడ్ పై ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. లుంబార్ రాడిక్యూలో పథి విజయవంతమైందని తెలిపింది.’