బిగ్ బాస్ వివాదంతో రగిలిపోతుంది. రోజుకొకరు బిగ్ బాస్ పై ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో వివాదం మరింత ముదురుతోంది. నేడు ఓయూ విద్యార్ధులు హోస్ట్ నాగార్జున ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేసారు. ఇలాంటి చెత్త షో నుంచి కింగ్ తప్పుకోవాలంటూ డిమాడ్ చేసారు. బిగ్ బాస్ నిర్వాహకుల్లో ఏఒక్కరిని వదిలి పెట్టేది లేదంటూ అల్టిమేటం జారీ చేసారు. తాజాగా నటి మాధవిలత బిగ్ బాస్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఎంపిక సమయంలో నిర్వాహకులు అడిగే ప్రశ్నలు అసభ్యంగా, అభ్యంతరకరంగా ఉన్నాయని ఆరోపించింది. తాను కంటెస్టెంట్ గా వెళ్లినప్పుడు నిర్వాహకులు అడిగిన ప్రశ్నలతో చాలా ఇబ్బంది పడ్డానని, ఎం చేయాలో తెలియక ఏడుపు వచ్చినంత పనైందని తెలిపింది.
హౌస్ లో ఒకరితో ఒకరు ప్రేమలో పడినప్పుడు ఏం చేస్తారాని? అప్పుడు వాళ్ల ఆలోచనలు ఎలా ఉంటాయంటి వంటి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టారుట. కంటెస్టెంట్లు పడుకోవడానికి స్ర్తీ, పురుషుల ఇద్దరికి వేరు వేరుగా గదులు ఏర్పాటు చేసినప్పటికీ ఎలిమినేషన్ అయ్యే కొద్ది ఒకే రూమ్ లో పడుకునే పరిస్థితి ఏర్పుడుతుందని వాపోయింది. బాత్రూమ్ లో కనిపించే వరకూ కమోండ్ వరకూ కెమెరా ఉంటుందని, డోర్ దగ్గరకు వేసుకునే వరకూ ఆ కెమెరా కవర్ చేస్తుందని తెలిపింది. బాత్రూమ్ లో స్పై కెమెరాలు ఏర్పాటు చేసేరేమోనని అనుమానం వ్యక్తం చేసింది. ఇక అందులో గేమ్స్ సైతం ఆడవాళ్లు, మగవాళ్లు తాకే విధంగా ఉంటాయని….ఆ సమయంలో చాలా అసౌకర్యంగా అనిపిస్తుందని ఆరోపించింది.
షో చేసే ముందు నాగార్జున ఈ విషయాలన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదని సూచించింది. ఆరోపణలు వరకూ బాగానే ఉంది. కానీ మాధవిలత బిగ్ బాస్ షోలో పాల్గొన్నే అవకాశం ఇప్పటివరకూ రాలేదు. సీజన్-2 కు వెళ్లే అవకాశం వచ్చినా ఇంటర్వూ ప్రోసస్ లో అవకాశం కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆమె ఆరోపణలు కాస్త డిఫెన్స్ లో పడేస్తున్నాయని కొంత మంది వాదన. అవకాశం చేజారిపోయిందన్న కోపంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తోంది తప్ప! అనుభవ పూర్వకంగా కాదని అంటున్నారు. మరి ఈ వివాదానికి…ఆరోపణలకు ఎలాంటి ముగింపు దొరుకుతుందో చూడాలి.