సిగరెట్ తాగిన ప్రియాంక చోప్రా.. ఆస్తమా ఉండి అదేం పనంటున్న అభిమానులు..!

-

తన 37వ జన్మదినం సందర్భంగా ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి మియామీలో ఓ రెస్టారెంట్‌లో సిగరెట్ తాగుతూ కనిపించింది. దీంతో ప్రియాంక చోప్రా అభిమానులు ఆమె పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మద్యం సేవించే వారిని ఆ పని చేయవద్దని చెబితే ఊరుకుంటారా..? సిగరెట్ తాగే వారిని పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెబితే వాటిని వారు మానేస్తారా..? లేదు కదా.. మర‌లాంటప్పుడు అలాంటి వారు పొగ‌ తాగకూడదు, మద్యం సేవించకూడ‌ద‌ని ఇత‌రుల‌కు చెబితే.. ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో తెలుసు కదా.. అవును గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా అదే చేస్తోంది.. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…

priyanka chopra smoke cigarette trolled by netizens

గ‌త‌ ఏడాది దీపావళి సందర్భంగా ప్రియాంక చోప్రా తనకు ఆస్తమా ఉందని.. అందుకే దీపావళికి దూరంగా ఉంటున్నానని.. తన అభిమానులు కూడా బాణసంచా వల్ల వచ్చే పొగ నుంచి దూరంగా ఉండాలని చెబుతూ.. బాణాసంచా కాల్చివద్దని ఆమె అంద‌రికీ పరోక్షంగా త‌న ట్వీట్ల ద్వారా తెలిపింది. అయితే తాజాగా తన 37వ జన్మదినం సందర్భంగా ఈ అమ్మడు తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి మియామీలో ఓ రెస్టారెంట్‌లో సిగరెట్ తాగుతూ కనిపించింది. దీంతో ప్రియాంక చోప్రా అభిమానులు ఆమె పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీపావళి స‌మ‌యంలో.. తనకు ఆస్త‌మా ఉందని.. అందుకే బాణసంచా కాల్చకుండా దూరంగా ఉంటున్నానని.. ఆస్తమాకు మందులు వాడుతున్నాన‌ని చెప్పిన ప్రియాంక.. ఇప్పుడు సిగరెట్ ఎలా తాగుతున్నావంటూ ట్విట్టర్లో నెటిజన్లు ఆమెను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కొందరు.. అవి పతంజలి సిగరెట్ల‌ని, వాటిని ఎంత‌ తాగినా ఏమీ కాదని కామెడీ చేస్తున్నారు. ఇంక మరి కొందరైతే.. నీతులు చెప్పేందుకు అందరికీ వీలవుతుంది కానీ వాటిని పాటించడం ఎవరికీ సాధ్యం కాద‌ని, సెలబ్రిటీలు కూడా ఇందుకు మినహాయింపు కాద‌ని, వారు కూడా కొన్నిసార్లు ఇలాగే చేస్తుంటారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఏదేమైనా.. ప్రియాంక చోప్రా ఇలా సిగరెట్ తాగడం ఆమె అభిమానులు అందరినీ ఒక్క‌సారిగా షాక్‌కు గురి చేసింది.. మ‌రి త‌న‌పై వ‌స్తున్న నెగెటివ్ కామెంట్ల ప‌ట్ల ప్రియాంకా ఎలా స్పందిస్తుందో చూడాలి..!

Read more RELATED
Recommended to you

Latest news