వావ్… మెహరీన్… ఇంత అందంగా ఉన్నావేంటి?

-

మెహరీన్ కౌర్ తెలుసు కదా. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తెరంగేట్రం చేసి వరుస హిట్లతో దూసుకుపోతున్నది. ఈ తెల్ల తోలు సుందరి తన కెరీర్ తొలినాళ్లలోనే తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదాను అనుభవిస్తోంది. నక్క తోక తొక్కి వచ్చినట్టుంది ఇండస్ట్రీకి అందుకే.. ఆమె పట్టుకున్నదల్లా బంగారం అవుతోంది. వరుసగా సినిమాలు చేస్తూ.. హ్యాట్రిక్ విజయాలను తన ఖాతాలో వేసుకొని చేతిలో బోలెడు ఆఫర్లను అందిపుచ్చుకున్న ఈ బ్యూటీ.. ఇటీవలే తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ స్టన్నింగ్ ఫోటోను షేర్ చేసింది. బ్లా ఔట్ ఫిట్ తో జాలువారుతున్న నెక్లెస్ స్టయిల్ తో ఫోటోకు పోజిచ్చింది. ఇక.. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు మాత్రం వావ్ అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఏంది మెహరీన్ ఇంత అందంగా ఉన్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version