మస్తాన్ సాయికి 14 రోజుల రిమాండ్ విధించిన రంగారెడ్డి కోర్టు

-

గుంటూరు జిల్లాకు చెందిన మస్తాన్ సాయి పూర్తి పేరు రావి మస్తాన్ సాయి. బీటెక్ చదివి ఏడాది కాలం పాటు హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కూడా చేశాడు. ఆ సమయంలోనే డ్రగ్స్‌కు బానిసయ్యాడు. కొన్నాళ్లకు అదే వ్యాపారంగా మలుచుకున్నాడు. ఈ క్రమంలోనే టాలీవుడ్‌కు చెందిన పలువురితో సంబంధాలు ఏర్పడ్డాయి. సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపే అమ్మాయిలను మస్తాన్ సాయి టార్గెట్ చేసేవాడు.

దీనికి  సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌ను ఆయుధం వాడుకునేవాడు అన్న టాక్ కూడా ఉంది. సినిమా పిచ్చితో అందమైన ఫోటోలు పెట్టే అమ్మాయిలను, మహిళలకు మెసేజులు పంపి గాలం వేసేవాడు. కూల్ డ్రింకులు, చాక్లెట్ల ద్వారా డ్రగ్స్ ఇచ్చి.. వారిని లైంగికంగా లోబర్చుకునేవాడు. ఆ దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించి అనంతరం వారిని బ్లాక్ మెయిల్ చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. పోలీసుల కస్టడీలో ఉన్న మస్తాన్ సాయికి రంగారెడ్డి కోర్టు తాజాగా 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. మస్తాన్ సాయి ఇంట్లో జరిగిన డ్రగ్స్ పార్టీలపై కూడా పోలీసులు దృష్టి సారించారు. డ్రగ్స్ పార్టీకి సంబంధించిన వీడియోలో ఉన్నవారందరూ ప్రస్తుతం పరారీలో ఉండగా.. వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version