దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి- యాంకర్ రష్మీ లవ్ ట్రాక్ గురించిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెరీర్ ఆరంభంలో ‘యువ’ అనే సీరియల్‌లో యాంకర్ రష్మీ నటించిన విషయం తెలిసిందే.
ఈ సీరియల్‌లో అతిథి పాత్రలో డైరెక్టర్ రాజమౌళి కనిపించారు. ఇందులో రాజమౌళి-రష్మీలపై ఓ సరదా లవ్ ట్రాక్ సీన్ ఉంటుంది. అప్పటి వీడియో తాజాగా వైరల్ కావడంతో ఇదెప్పుడు వచ్చిందంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దేశం గర్వించదగ్గ డైరెక్టర్‌గా ఉండగా.. రష్మీ యాంకర్‌గా మంచి పొజిషన్‌లో ఉన్న విషయం తెలిసిందే.
రాజమౌళి-రష్మీ సరదా లవ్ ట్రాక్.. నెట్టింట వైరల్ అవుతున్న పాత వీడియో
కెరీర్ ఆరంభంలో 'యువ' అనే సీరియల్‌లో నటించిన యాంకర్ రష్మీ
ఈ సీరియల్‌లో గెస్ట్ రోల్లో కనిపించిన డైరెక్టర్ రాజమౌళి
ఇందులో రాజమౌళి-రష్మీలపై ఓ సరదా లవ్ ట్రాక్
అప్పటి వీడియో తాజాగా వైరల్ కావడంతో ఇదెప్పుడు… pic.twitter.com/facOYMkn3D
— BIG TV Breaking News (@bigtvtelugu) February 19, 2025