మళయాల ఇండస్ట్రీలో ప్రస్తుతం హేమా కమిటీ రిపోర్టు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇండస్ట్రీలోని పెద్దలు, సీనియర్ నటుల మీద లైంగిక వేధింపుల ఆరోపణలతో పాటు ఒక్కొక్కరిగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ పరిణామాలను కేరళ ప్రభుత్వంతో పాటు ఇతర ఇండస్ట్రీల పెద్దలు కూడా నిశితంగా గమనిస్తుండటంతో పాటు సీనియర్ నటీనటులు, హీరోయిన్లు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు.
తాజాగా మళయాల ముద్దుగుమ్మ నివేదా థామస్ హేమా కమిటీ రిపోర్టుపై షాకింగ్ కామెంట్స్ చేశారు.‘ మళయాళ ఇండస్ట్రీకి ఇది ఒక చేదు అనుభవం. ప్రస్తుతం జరిగే పరిణామాలను నిశితంగా గమనిస్తున్నా. హేమా కమిటీ ఏర్పాటుకు కారణమైన WCCను అభినందిస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు ప్రతిచోటా అమలు చేయాలి. కేవలం ఇది మహిళల కోసమే కాకుండా ప్రతిఒక్కరికీ పని ప్రదేశాల్లో సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలి.ఇంట్లో కంటే ఎక్కువగా వర్క్ స్పేసులో ఉంటున్నాం. అందుకే సురక్షితమైన వాతావరణం అవసరం’ అని నివేదా అభిప్రాయపడ్డారు.