ఈరోజుల్లో మోసాలు ఎక్కువైపోతున్నాయి. మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఫైనాన్షియల్ పేమెంట్ స్కామ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఇలాంటి మోసగాళ్లకు భారతదేశం అడ్డాగా మారిపోయింది. అందుకు ప్రధాన కారణం డిజిటల్ వరల్డ్ లోకి మనం వేగంగా అడుగుపెట్టడమే. దాదాపు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఇంటర్నెట్ సదుపాయం ఉంటోంది. ప్రతి స్మార్ట్ ఫోన్ యూజర్ డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. దీంతో స్కామర్లకు ప్రజల్ని మోసగించడం ఈజీ అయిపోయింది.
రకరకాలుగా మోసగాళ్లు మోసాలకి పాల్పడుతున్నారు. ఈ మోసాల కారణంగా అందరి జేబులకి చిల్లు పడుతోంది. ప్రస్తుతం వేగంగా పెరుగుతున్న క్యూఆర్ కోడ్ మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ మోసం ఏంటి,.? వీటి బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రజల్ని ట్రాప్ చేయడానికి స్కామర్లు ఒక క్యూఆర్ కోడ్ ని పంపించి అందరినీ టెంప్ట్ చేస్తున్నారు. ముందుగా డబ్బు పంపమని ప్రలోభ పెడుతున్నారు. స్కాన్ చేస్తే పేమెంట్ వస్తుందని మోసం చేస్తున్నారు. కేవలం క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అని ప్రచారం చేస్తున్నారు. నకిలీ క్యూర్ కోడ్స్ ని క్రియేట్ చేస్తారు. వీటిని స్కాన్ చేసిన వెంటనే ఫేక్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.
తర్వాత పేమెంట్ కోసం ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు లాగిన్ డీటెయిల్స్ వంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటున్నారు. వివరాలను ఎంటర్ చేసిన వెంటనే ఓటీపీ వస్తుంది. అది కూడా ఎంటర్ చేస్తే స్కామర్లకు మీ బ్యాంక్ అకౌంట్ యాక్సిస్ లభిస్తుంది. ఇక మీ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. క్యూర్ కోడ్ పంపించి జాబ్ పొందవచ్చన్నా, పేమెంట్ వస్తుందన్నా నమ్మకండి. ఇటువంటి వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. అనవసరమైన లింక్స్ మీద క్లిక్ చేయడం, మెయిల్స్ కి మెసేజ్ లకి వచ్చిన లింక్స్ కి రెస్పాండ్ అవ్వడం వంటివి చేయకండి.