బండారు సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ. ఏపీ మంత్రి రోజా పై టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల పై స్పందించారు సినీ నటి రమ్య కృష్ణ. రోజాకు మద్దతు ప్రకటించిన రమ్యకృష్ణ… బండారు సత్యనారాయణ పై ఫైర్ అయ్యారు. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీనే దిగి వచ్చి… బండారు సత్యనారాయణ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ….రోజా పై చేసిన అసభ్య వ్యాఖ్యలు నాకు తీవ్ర ఆవేదన కలిగించాయన్నారు టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ. ఇవి రోజాను మాత్రమే కాదు ఆమె కుటుంబాన్ని కూడా టార్గెట్ చేయటమేనని.. అందరూ మహిళల పై జరుగుతున్న శారీరక, మానసిక హింసను వ్యతిరేకించాలని కోరారు టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ఈ ఘటన పై స్పందించాలి..బండారు సత్యనారాయణ పై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు టాలీవుడ్ సీనియర్ నటి రమ్యకృష్ణ.