నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో హైటెన్షన్..అసలు ఏంటి వివాదం

-

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో హైటెన్షన్ నెలకొంది. నేడు చలో వేల్పూర్ కు కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ తరుణంలో వేల్పూర్ లో భారీగా పోలీసులు మోహరించారు.

High tension in Velpur, Nizamabad district
High tension in Velpur, Nizamabad district

డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, బాల్కొండ ఇంఛార్జ్ సునీల్ రెడ్డి సహా ముఖ్య నేతలు గృహ నిర్బంధంలో ఉన్నారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కళ్లు మూసుకుపోయి సోయి లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మానాల మోహన్ రెడ్డి.

దమ్ముంటే నాతో వేముల చర్చకు రావాలి గల్ఫ్ కార్మికుల సమస్య పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ప్రశాంత్ రెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవం అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేయని ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే బుద్ధి చెబుతామని ప్రశాంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నా అన్నారు మానాల మోహన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news