బన్నీ హీరోయిన్ కి పెళ్లి

-

అల్లూ అర్జున్ పరుగు చిత్రంలో హీరోయిన్ నటించిన షీలా అందరికి గుర్తుందిగా..ఆ సినిమాలో ఎలగెలగా ఎలగెలగా అంటూ కుర్ర కారుని ఊపు ఊపింది షీలా కౌర్. ఆ తర్వాత ఎన్టీఆర్ తో అదుర్స్ సినిమాలో ఆడిపాడింది. గత కొంత కాలంగా ఆమె సిని ఇండస్ట్రీలో కనబడలేదు. కానీ ఇప్పుడు ఆమె పెళ్లితో ఇప్పుడు మరో సారి వార్తల్లో నిలిచింది.

చెన్నైకి చెందిన సంతోష్ రెడ్డి అనే వ్యాపారవేత్తను షీలా పెళ్ళి చేసుకుంది. తెలుగు, తమిళం,కన్నడ సినిమాల్లో నటించిన షీలా చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది. అయితే ఎన్ని భాషల్లో నటించినా షీలాకు సరైన హిట్ పడకపోవడంతో కెరీర్ డౌన్ ఫాల్ అయింది.

తొలి నాళ్ళలో స్టార్ హీరోలతో యాక్ట్ చేసే అవకాశం వచ్చినా ఆ సినిమాలేవీ షీలాకు గుర్తింపు తీసుకురాలేదు. రామ్ మస్కా, ఎన్టీఆర్ అదుర్స్, అల్లు అర్జున్ పరుగు సినిమాలు హిట్ అయినా షీలాకు అందులో ఎటువంటి గుర్తింపు రాలేదు. దీంతో ఇన్నాళ్ళూ షీలా బయటకు కనిపించలేదు. ఇప్పుడు పెళ్ళి చేసుకుని రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు సిద్దమైంది.

Read more RELATED
Recommended to you

Latest news