హీరోయిన్లనే తలదన్నే అందంతో నటి ఉమాదేవి కూతురు..!

-

టాలీవుడ్ లో బిజీగా ఉండే క్యారెక్టర్ ఆర్టిస్టులలో నటి ఉమాదేవి కూడా ఒకరు. వందల చిత్రాలలో .. సీరియల్స్ లో తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్న ఉమాదేవి బిగ్ బాస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చి తనదైన యాటిట్యూడ్ తో ప్రేక్షకుల మనసులు దోచుకుంది. ఇక ఉమాదేవి ఉన్నది ఉన్నట్టుగా నిజాయితీగా మాట్లాడితూ..హౌస్ లో శత్రువులను కూడా సంపాదించుకుంది. దాంతో ఎలిమినేషన్ లోకి రావడం వల్ల ఫైనల్స్ వరకు హౌస్ లో ఉండలేకపోయింది. అంతేకాకుండా కార్తీకదీపం సీరియల్ లో దీపకు బంధువు పాత్రలో నటించి అలరించింది . అయితే ఉమాదేవి సినిమాలపరంగా అందరికీ పరిచయస్తూ రాలే కానీ ఆమె వ్యక్తిగత విషయాలు ఏమీ కూడా ఆమె ఎప్పుడూ అభిమానులతో పంచుకోలేదు.

కానీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన ఫ్యామిలీ గురించి తెలిపింది. ఉమాదేవి తన భర్తతో విడాకులు తీసుకుంది .ఇక ఇద్దరి మధ్య గొడవలు రావడం వల్లే విడిపోయామని తెలిపింది. కానీ ఈమెకు ఇద్దరు కుమార్తెలు.. వారిద్దరూ తన వద్దే ఉన్నారని వారి భవిష్యత్తు తన లక్ష్యం అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా పెద్ద కుమార్తెను వీ. జే. సన్నీకి ఇచ్చే వివాహం జరిపించాలని అనుకున్నానని , తన కూతురు సన్నీ ఫ్యాన్ అని చెప్పింది. దాంతో ఒక సీరియల్ సమయంలో సన్నీ ని పరిచయం చేస్తే అతడిని అన్నయ్య అని పిలిచిందని సరదాగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఉమాదేవి పెద్ద కూతురు టీవీ షో లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.

Full Details - Uma Devi 2021 Bigg Boss Telugu 5 Contestant

ఉమాదేవి పెద్ద కూతురు తనూష ఇప్పటికే సోషల్ మీడియాలో వేల సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు ఇటీవల సురేఖవాణి కూతురు సుప్రీతాతో కూడా కలిసి సందడి చేసిన ఈమె త్వరలోనే సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం తన తల్లితో కలిసి రీల్స్ చేస్తూ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక అందం విషయంలో హీరోయిన్లనే తలదన్నే అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఉమాదేవి కూతుర్ని చూసిన తర్వాత అందరూ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news