పవన్ కళ్యాణ్ ధరించిన వాచ్, షూస్.. వామ్మో ఇన్ని లక్షలా?

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా అది వైరల్ అవుతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వర్క్ షాప్ జరుగుతోంది. అయితే వర్క్ షాప్ కు హాజరైన పవన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలో పవన్ ధరించిన వాచ్, షూస్ ధర ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

పవన్ కళ్యాన్ చాలా సింపుల్‌గా ఉంటారు. చాలా సాధరణమైన బట్టల్లో కనిపిస్తుంటారు. అయితే పవన్ కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేదిలో సమంత ఓ డైలాగ్ చెబుతుంది, ఆయన వాచ్ అమ్మితే… మీ బ్యాచ్ మొత్తం సెటిల్ అంటూ.. సమంత అన్న ఆ డైలాగ్స్ ఇప్పుడు పవన్ విషయంలో అచ్చం నిజమయ్యేలా ఉన్నాయి. పవన్ పెట్టుకున్న వాచ్ కాస్ట్ చూసి జనం నిజమే అని ఆశ్చర్యపోతున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ హిస్టోరియల్ మూవీ “హరిహర వీరమల్లు”. ఈ సినిమాకు క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక వారియర్ లుక్‌లో కనిపించనున్నారు. అది అలా ఉంటే ఈ సినిమా కొన్నాళ్ల పాటు షూటింగ్‌ జరుపుకుని ఆగిపోయింది. ఇక ఈ సినిమా షూటింగ్ విషయంలో టీమ్ మళ్ళీ దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది.

అందులో భాగంగా తాజాగా అమెరికా నుంచి తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సంబంధించిన వర్క్ షాప్‌లో పాల్గోంటున్నాడట. దీనికి సంబంధించి ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి పెట్టిన లేటెస్ట్ పోస్ట్ ఇప్పుడు మంచి వైరల్ గా మారిపోయింది. ఈ లేటెస్ట్ లుక్‌లో పవన్ కోర మీసాలతో.. అదరగొట్టారని అంటున్నారు నెటిజన్స్.. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి పవన్ ఈ సినిమా కోసం 50 రోజుల డేట్లు కేటాయించగా ఆ డేట్లు పూర్తయ్యేలోగా క్రిష్ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాల్సి ఉంది. అయితే వర్క్ షాప్ కు హాజరైన పవన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ ఫోటోల్లో పవన్ జీన్స్ టీషర్ట్ లో చాలా సింపుల్‌గా కనిపిస్తున్నాడు ఇక ఈ ఫోటోను సీరియస్‌గా పరిశీలిస్తున్న ఆయన ఫ్యాన్స్… పవన్ చేతికి ఉన్న వాచ్ ఎంత కాస్ట్లీ ఉంటుందో అని నెట్టింట శోధించడం మొదలు పెట్టారు. పవన్ పెట్టుకున్న వాచ్ పనరెయ్ సబ్ మర్సిబుల్ కార్బెన్ టెక్ 47mm, ఈ వాచ్ ధర అక్షరాల… రూ. 14.7 లక్షల అంట. దీంతో ఈ వాచ్ ధర తెలిసి షాక్ అవుతున్నారు.

 

అంతేకాదు వపన్ వేసుకున్న షూ గురించి కూడా ఆయన అభిమానులు ఆరా తీశారు. కోపెన్ హాగన్ బ్రాండ్ కు ధరించిన షూస్ ను పవన్ ధరించగా ఈ షూస్ ఖరీదు ఏకంగా 9 లక్షల 60 వేల రూపాయలు కావడం గమనార్హం. అయితే పవన్ పెట్టుకున్న వాచ్, వేసుకున్న షూ ఇంత కాస్ట్లీనా అంటూ జనం నోరెళ్ల బెడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ రేంజ్ లో ఖర్చు చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. వీటిధరలు తెలిసి పవన్ అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక హరిహర వీర మల్లు సినిమా షూటింగ్ అనేక వాయిదాల తర్వాత ఆ మధ్య మొదలై.. మళ్లీ ఆగిపోయింది. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా ఇప్పటికే దాదాపు 60 శాతం మేర షూటింగ్ పూర్తి చేసుకుంది. సమ్మర్ కానుకగా హరి హర వీరమల్లు చిత్రాన్ని 2023 ఏప్రిల్ 29న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది. హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news