HIT 2 అంటూ షాక్ ఇచ్చిన అడివి శేషు.. ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల

-

విభిన్న క‌థాంశాల‌ను ఎంచుకుని భారీ హిట్ లు కొట్టే అడివి శేషు మ‌రోసారి సరి కొత్త క‌థ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. HIT 2 అనే సినిమా ఫ‌స్ట్ గ్లింప్స్ ను విడుద‌ల చేసి అంద‌రినీ షాక్ కు గురి చేశాడు. HIT 2 అంటూ ది సెకండ్ కేస్ అంటు ఉప శీర్ష‌క‌తో ఈ రోజు ఫస్ట్ గ్లింప్స్ ను విడుద‌ల చేశాడు. అయితే ఈ HIT 2 సినిమా లో కేడీ అనే పోలీసు అధికారి గా అడ‌వి శేష్ క‌నిపించ నున్నాడు. అయితే గ‌తం లో HIT అనే సినిమా తో యువ క‌థ‌నాయ‌కుడు విశ్వ‌క్ సేన్ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి.. మంచి హిట్ అందుకున్నాడు.

దీంతో ఈ సినిమా కు సిక్వెల్ గా HIT 2 ను తీస్తున్నారు. కాగ ఈ సినిమా ను విశాఖప‌ట్నం నేప‌థ్యం లో తీశారు. ఇప్ప‌టి కే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. కాగ వ‌చ్చే ఏడాది లో ఈ సినిమా ను విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. కాగ విశ్వ‌క్ సేన్ హిట్ సినిమా కు ద‌ర్శ‌కత్వం వ‌హించిన శైలేష్ కొల‌ను ఈ సినిమా కు కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కాగ అడివి శేషు ప్ర‌స్తుతం మేజ‌ర్ అనే సినిమా లో కూడా న‌టిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news