Adipurush : ” ఆదిపురుష్” టీజర్ కు ముహుర్తం ఫిక్స్..రాముడి అవతారంలో ప్రభాస్ పిచ్చెక్కించేశాడుగా !

-

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసు కువెళుతున్నాడు.. నేషనల్ స్టార్ అయ్యాక మరింత స్పీడు పెంచి వరుస పెట్టి సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ఇక ఇందులో ముఖ్యంగా ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడిగా కనిపిస్తున్నాడు‌. రావణుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ చేస్తున్నారు. ఆ పాత్ర పేరుని లంకేష్ అని ప్రకటించారు కూడా. లంకేష్ పాత్రలో కనిపించనున్నారు సైఫ్ ఆలీ ఖాన్. తాజాగా ఆదిపురుష్ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమా టీజర్‌ ను అక్టోబర్ 2వ తేదీన రిలీజ్‌ చేయనున్నట్లు చిత్ర బృందం ఓ పోస్టర్‌ ను రిలీజ్‌ చేసింది. ఈ పోస్టర్‌ లో రాముడి అవతారంలో ప్రభాస్‌ కన్నులారా కనిపించగా.. అక్టోబర్ 2వ తేదీన రాత్రి 7.11 గంటలకు టీజర్‌ ను రిలీజ్‌ చేస్తున్నట్లు పోస్టర్‌ ద్వారా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news