‘జీ2’.. గేమ్‌ ఛేంజింగ్‌ ఫిల్మ్‌..  అడివి శేష్‌ ఇంట్రెస్టింగ్ ట్వీట్‌

-

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ సినీ కెరీర్ లో గూఢచారి సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత శేష్ వరుస విజయాలతో టాలీవుడ్ లో దూసుకెళ్తున్నాడు. వరుసగా మేజర్, హిట్ -2 సినిమాలు ఇచ్చిన సక్సెస్ జోష్ లో ఉన్న శేష్ తన కొత్త సినిమా గురించి ఓ అప్డేట్ ఇచ్చాడు. జీ-2 సినిమాను గేమ్‌ ఛేంజింగ్‌ ఫిల్మ్‌గా వ్యాఖ్యానించాడు.

‘టాలీవుడ్‌లో వచ్చిన ది బెస్ట్‌ స్పై థ్రిల్లర్లలో ఇదొకటి’ అని పేర్కొంటూ ఓ నెటిజన్‌ ‘గూఢచారి’  గ్లింప్స్‌ని ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. దానిపై స్పందించిన శేష్‌ సీక్వెల్‌పై ట్వీట్‌ పెట్టారు. ‘‘మీ ప్రేమకు ధన్యవాదాలు. గేమ్‌ ఛేంజింగ్‌ మూవీని అందించేందుకు దర్శకుడు వినయ్‌ కుమార్‌ సిరిగినీడి, రచయిత అబ్బూరి రవి ఆరు నెలలుగా కష్టపడుతున్నారు. ‘జీ2’ (G2) స్క్రిప్టు భారీ స్థాయిలో ఉండనుంది. వినయ్‌ కుమార్‌ విజన్‌ చూస్తుంటే అప్పుడప్పుడు నాకు భయమేస్తుంది. కానీ, నేను చెప్పబోయేది ఒక్కటే.. సినిమా అదిరిపోద్ది’’ అని  ట్వీట్ చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news